హైదరాబాద్, మహా: మాజీ మంత్రి హరీశ్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. జ్వరంతో ఆయన సికింద్రాబాద్ సన్ సైన్ హాస్పిటల్‌లో చేరారు. సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లోనే ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో హాస్పిటల్‌లో చేరారు. మరో వైపు ఫార్ములా ఈ రేసింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఏసీబీ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం కేటీఆర్, హరీశ్ రావుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అయితే అప్పటికే హరీశ్ రావు జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. మీడియా సమావేశంలో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల ఆయన మరింత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ మీడియా సమావేశం మధ్యలోనే ముగించారు. హరీశ్ రావును హాస్పిటల్‌కు పంపించారు.
Post Views: 81








