AP: గుంటూరు జైలులో వైసీపీ నేత నందిగం సురేశ్ మంగళవారం అస్వస్థతకు గుర్యయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయనను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంబులెన్స్ నుంచి వీల్ చైర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు సైతం హుటాహుటిన ఆసుపత్రికి వద్దకు వచ్చారు. అయితే.. పోలీసులు మాత్రం వారికి అనుమతించేందుకు నిరాకరించినట్లు సమాచారం. టీడీపీ కార్యకర్త రాజుపై దాడి కేసులో సురేశ్ రిమాండ్‌లో ఉన్నారు.
Post Views: 18








