హన్మకొండ మహా;
3 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు దగ్గరలోని అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు.
మంగళవారం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ హనంకొండ జిల్లా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి గారి అధ్యక్షతన 49వ డివిజన్ జులైవాడ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అమ్మ మాట -అంగన్వాడి బాట ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ కి పిల్లల్ని పంపించినట్లయితే వారిలో శారీరక పెరుగుదలతో పాటు మానసిక, సామాజిక, మేధో అభివృద్ధి కూడా జరుగుతుందన్నారు. అంగన్వాడీ టీచర్స్ అందరూ చిత్తశుద్ధితో న్యూ కరికులమ్ ప్రకారం ఫాలో అవుతూ పిల్లలని అంగన్వాడీ కేంద్రం పూర్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించుకోవాల్సిందిగా ఆదేశించారు. ఉదయం 9 గంటలకే అన్ని అంగన్వాడీ కేంద్రాలలో బెల్ మోగించి ప్రీస్కూల్ కార్యక్రమాలని న్యూ టైం టేబుల్, సిలబస్ ద్వారా నిర్వహిస్తూ ప్రీస్కూల్ నమోదు, హాజరు ను పెంచి, పిల్లలని సాయంత్రం నాలుగు గంటల వరకు అంగన్వాడీ సెంటర్లోనే ఉంచవలసిందిగా కోరారు. ఆరోగ్యలక్ష్మి ద్వారా అందించే ఒక పూట సంపూర్ణ భోజనాన్ని గర్భిణీలు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాలలోనే తినేలా చూడాలని సూచించారు. అనంతరం
మూడు సంవత్సరాల నిండిన 30 మంది పిల్లలకు జిల్లా కలెక్టర్, 49వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస రాంప్రసాద్ సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ హనుమకొండ సిడిపిఓ ఎం విశ్వజ, సూపర్వైజర్స్ వి రాజలక్ష్మి , ఎం జ్యోతి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ డి. ప్రీతి, డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ డి కళ్యాణి అండ్ స్టాప్, సఖి అడ్మిన్ హైమావతి అండ్ స్టాఫ్, అంగన్వాడీ టీచర్లు ఎం ప్రసన్న, రమాతార , అంగన్వాడి హెల్పర్లు, ఏఎన్ఎంలు,ఆశా వర్కర్లు, అంగన్వాడి లబ్ధిదారులు పాల్గొన్నారు.








