Mahaa Daily Exclusive

  నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్..!

Share

వరంగల్ మహా;

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిడబ్ల్యూఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.

మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో
అన్ని విభాగాల అధికారులతో సమావేశమై
పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, ఎలక్ట్రికల్, హార్టికల్చర్, డి ఆర్ ఎఫ్ కార్యకలాపాల పై సమీక్షించారు.
అనంతరం సఫాయి మిత్రా కార్మికుల ఆరోగ్య రక్షణలో భాగంగా నమస్తే కార్యక్రమం క్రింద 37 మంది సఫాయి మిత్ర కార్మికులకు, సెప్టిక్ ట్యాంక్ ఆపరేటర్లకు పి పి ఈ పిట్లను కిట్లను మేయర్, కమిషనర్లు అందజేశారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ జోన, ఇంచార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇంచార్జ్ ఎస్ ఈ శ్రీనివాస్, సీఎం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ శివ లింగం, హార్టికల్చర్ ఆఫీసర్లు రమేష్, లక్ష్మారెడ్డి ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, డీఎఫ్ శంకర్ లింగం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మహేందర్, రవికుమార్, సంతోష్ బాబు, మాధవి లత, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.