Mahaa Daily Exclusive

  ఆరుట్ల గ్రామంలో 60 తాటి చెట్ల నరికివేత..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:
మంచాల మండలం ఆరుట్ల గ్రామం సర్వే నెంబర్ 693/7 లో ఉన్న 100 తాటి చెట్లను నరికి వేస్తున్నారని సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం అబ్కారీ శాఖ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అధికారులు చేరుకునే సమయానికి 60 తాటి చెట్లు నేలమట్టం చేశారని, అధికారులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న జెసిబి ఆపరేటర్లు అక్కడి నుంచి పారిపోయారని ఎస్ఐ తెలిపారు. మోహన్ రెడ్డి అనే రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేరుకున్న అబ్కారీ శాఖ ఎస్సై నాగమణి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ … ఎవరైనా తన సొంత పొలంలో అయినా తాటి చెట్లు నరికి వేయాలంటే సంబంధిత ఆబ్కారీ శాఖ అనుమతులు తప్పనిసరి అని, ఈ తాటి చెట్లు నరికివేత పై ఎలాంటి ముందస్తు సమాచారం గానీ, అనుమతులు గాని లేవని దీనికి కారణం ఎవరైనా వదిలిపెట్టేది లేదని, చట్టానికి లోబడి అందరూ అనుమతులు పొందాలని ఆబ్కారి శాఖ అధికారులు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సై నాగమణితో సిబ్బంది గణేష్, ప్రేమలతలు పాల్గొన్నారు.