Mahaa Daily Exclusive

  వాహనాల మరమత్తులో జాప్యం తగదు నగర మేయర్ గుండు సుధారాణి ..!

Share

హన్మకొండ మహా;

వాహనాల మరమత్తులో జాప్యాన్ని నివారించాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఈ సందర్భంగా
కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి బాలసముద్రం లో బల్దియా నిర్వహిస్తున్న వెహికల్ షెడ్ ను మంగళవారం క్షేత్ర స్తాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వెహికల్ షెడ్ లో ఎన్ని వాహనాలు మరమత్తులకు గురి అయి ఉన్నాయి? ఎన్ని వాహనాలకు ఏ ఏజెన్సీ తో ఒప్పందం కుదుర్చుకున్నారు? వాహనాలు మరమ్మతులకు గురి అయితే అలక్ష్యము వహించకుండా వెంటనే మరమత్తులు చేపట్టాలని వాటికి సంబంధించిన అప్రూవల్ వెంటనే ఇవ్వడం జరుగుతుందని ,స్క్రాప్ కు టెండర్ పిలవాలని వాహనాలకు సంబంధించిన స్క్రాప్ ను వెంటనే డిస్పోస్ చేయాలని కొత్త గా ఎన్ని వాహనాలు కొనుగోలు చేయనున్నారు? మొత్తం ఎన్ని డస్ట్ బిన్లు కొనుగోలు చేస్తున్నారు? ఏజెన్సీ ఎవరు? ఇందులో ఎందుకు జాప్యం జరుగుతుంది ? ఇక్కడ పనులు చేసే రోజువారి సిబ్బంది సంబంధించిన ఏజెన్సీ ఎవరు? ఏజెన్సీ కి అందజేసే రిపేరింగ్ బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే సిబ్బందికి వేతనాలు చెల్లించి మిగతా అమౌంట్ వారికి అందజేయాలని సూచించారు. ముఖ్యంగా పెద్ద వాహనాలకు మరమ్మతులకు గురైతే వెంటనే పనులు ప్రారంభించి అప్రూవల్ కోసం ఫైల్ పంపించాలని పారిశుద్ధ్య పనులకు సంబంధించి తరలింపు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వాహనాల మరమ్మతులు వెంటనే పూర్తి చేసి అందించాలని ఈ సందర్భం గా మేయర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఎంహెచ్ఓ డా. రాజారెడ్డి, ఏం హెచ్ ఓ డా.రాజేష్ , ఈ ఈ మహేందర్, డి ఈ లు రాజ్ కుమార్, శివానంద్, ఏఈలు ఫణి, సంతోష్ కుమార్, సానిటరీ సూపర్వైజర్ నరేందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, తదితరులు, పాల్గొన్నారు.