ఆదిలాబాద్, మహా
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కంటే అధికంగా విధ్వంసం జరిగింది. మంత్రులకు కూడా ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేవి కావు.. అక్కడి వరకు వెళ్లి తిరిగి వచ్చే పరిస్థితి ఉండేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హ
గతంలో 22మంది సీఎంలు పాలించిన సమయంలో రాష్ట్ర అప్పు రూ. 75వేల కోట్లు ఉంటే.. ఈ పదేళ్ల కాలంలో ఏకంగా రూ.8లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వానిది కేవలం గ్లోబెల్ ప్రచారం మాత్రమేనని కొట్టి పారెశారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో బీహార్, ఉత్తర్ ప్రదేశ్ కు నిధులు కేటాయించినట్లు తెలంగాణ కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ ఆ పార్టీకి ఉన్న ఎనిమిది మంది ఎంపీ లు, మరో ఎనిమిది మంది ఎమ్మెల్యే లు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం పై మాట్లాడే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని హితవుపలికారు. గతంలో రైతులు నష్టపోతే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం ఎకరానికి రూ. 10వేల చొప్పున అందజేస్తోందని చెప్పారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇబ్బందులకు గురిచేస్తున్నా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి నెల రూ. 600కోట్ల పై చిలుకు ఈఏంఐ లు చెల్లిస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ళు, రైతుభరోసా, సన్న బియ్యం తదితర పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని అవినీతి కి ఆస్కారం లేకుండా పాలన సాగిస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు లను వెనువెంటనే పరిష్కరించాలని.. ఆ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని గుర్తు చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని ఇక్కడ పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో నాది కూడా ఉండొచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశం లో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి, ఆయా నియోజకవర్గాల ఇంచార్జీలు శ్యామ్ నాయక్, రావి శ్రీనివాస్, నాయకులు దిగంబర్ రావు పాటిల్, గోక గణేష్ రెడ్డి, లోక ప్రవీణ్ రెడ్డి, గిమ్మ సంతోష్ రావు, కొండ గంగాధర్, బొల్లారపు బాబన్న తదితరులు పాల్గొన్నారు.








