గత రెండు రోజుల క్రితం మంచిర్యాల ఎస్సి వెల్ఫేర్ డిగ్రీ కళాశాల వసతి గృహం పైనుండి దూకిన విద్యార్థిని కుమ్మరి స్వప్న (19) హైదరాబాద్ నేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఈ విషయంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి దోశలను కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
మృతురాలు స్వప్న ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూరు మండలం, మార్తెడ్ గ్రామానికి చెందింది. ఆమె మంచిర్యాలలో బిజెడ్సి విద్యను అభ్యసిస్తుంది. గత మూడు నెలల కాలంలో ఈ హాస్టల్ భవనం పై నుండి ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య రెండు కు చేరింది. ఇప్పటివరకు మృతురాలు స్వప్న ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఎవరైనా భవనం పై నుండి ఎవరైనా తోసేసారా అనే విషయం తేలలేదు. దీనితో ఆ వసతి గృహంలో ఉన్న బాలికల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. తక్షణమే ఈ రెండు ఘటనలపై చోటు చేసుకున్న మిస్టరీని పోలీసులు త్వరగా చేదించి విద్యార్థినీలా తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.








