నేలకొండపల్లి, జూన్ 27 మహా:
దివ్యాంగుల హక్కుల సాధన కోసం క్షేత్ర స్థాయి లో ఉద్యమించాలని భారత తెలంగాణ దివ్యాంగుల సమితి, టీడీ జేఏసీ చైర్మన్ పీ.వీ.చలమయ్య పిలుపునిచ్చారు. మండలం లోని పైనంపల్లి లో శుక్రవారం దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు… దివ్యాంగులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల పై ఉద్యమాలకు సిద్ధం కావాలని సూచించారు. గతంలో సంఘం చేసిన ఆందోళనలు స్పూర్తిదాయకం అన్నారు. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పధకంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని పార్టీలు దివ్యాంగులకు సీట్లు కేటాయించాలని కోరారు. మండల కేంద్రం పోరాడి కార్యాలయం నిర్మాణం కోరకు స్థలం సాధించామని పేర్కోన్నారు. అదే స్ఫూర్తితో భవనం నిర్మాణం కోరకు సమిష్టిగా కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజెపీ మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్, మండల విద్యాశాఖాధికారి బీ.చలపతిరావు, సంఘం జేఏసీ నాయకులు రామకృష్ణ, చారీ, వెంకటేశ్వర్లు, సైదా, బ్రహ్మం, సఫియా, రాము, భద్రయ్య, వెంకన్న, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.








