Mahaa Daily Exclusive

  స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి – ఓసి ప్రభావిత ప్రాంతాల్లో యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీ. మధు డిమాండ్..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (మహా): సింగరేణి ఓసి ప్రభావిత ప్రాంతాల్లో యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు డిమాండ్ చేశారు. శుక్రవారం
స్థానిక పెనగడప గ్రామంలో సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మధు పాల్గొని మాట్లాడుతూ, త్వరలోనే సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి చేయడానికి సౌదా అనే కంపెనీ రాబోతుందని ఈ కంపెనీలో సింగరేణి ప్రభావిత ప్రాంతాల యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇదే ఓసి నందు వివిధ కంపెనీలలో గతంలో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందరికీ న్యాయం చేశాకనే, మిగతా యువతకు ఉద్యోగం కల్పించాలని అన్నారు. స్తానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వకుండా, దరఖాస్తుల పేరుతో వేరే ప్రాంతాల యువతను ఆకర్షించి లోపాయికరి ఒప్పందాలు చేసుకొని డబ్బులను సొమ్ము చేసుకునే పని చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇటువంటి భ్రమలో లో కల్పించే కంపెనీ ప్రకటనలు నమ్మొద్దని యువతకు పిలుపునిచ్చారు . యువకులకు ఉద్యోగాలి ఇప్పిస్తామని పేరుతో అడ్డదారులు తొక్కేందుకు అక్రమాలు చేసే వ్యక్తులను నమ్మొద్దని ఆయన అన్నారు. అక్రమాలకు పాల్పడే వ్యక్తులు తమరికి మోసం చేస్తే సిఐటియు సంఘ నాయకులకు దృష్టికి తీసుకురావాలని వారు కోరారు . స్థానిక యువతకు ప్రాధాన్యతనిచ్చి సి ఎస్ ఆర్ పాలసీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. యువకులను మోసం చేసే పద్ధతికి పాల్పడితే పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు .స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన అన్నారు .
ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం సిఐటియు కొత్తగూడెం బ్రాంచ్ నాయకులు భూక్య రమేష్ పప్పుల ప్రమోద్ సిఐటియు పెనగడప గ్రామ నాయకులు అల్లి నాగయ్య ,కట్ట శ్రీను, గణేష్, మాధవరావు, సురేష్ ,అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.