Mahaa Daily Exclusive

  సత్తుపల్లి నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్ సేవ…!

Share

సత్తుపల్లి, మహా.

సత్తుపల్లి డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్ సేవను ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ యూ. రాజ్యలక్ష్మి తెలిపారు. శుక్రవారం అశ్వారావుపేట బస్టాండ్‌లో ఈ బస్ సర్వీసు కోసం కరపత్రాన్ని విడుదల చేశారు.

జూలై 8 సాయంత్రం 7 గంటలకు సత్తుపల్లి డిపో నుంచి బస్ బయలుదేరుతుంది. మార్గమధ్యంలో కానిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శించుకుని, జూలై 10 పౌర్ణమి నాటికి అరుణాచలానికి చేరుకుంటుంది. అక్కడ గిరి ప్రదక్షణ అనంతరం తిరిగి సత్తుపల్లికి బస్ బయలుదేరుతుంది.

ఈ బస్‌ సూపర్ లగ్జరీగా (2+2 పుష్ బ్యాక్ సీట్లు) అందుబాటులో ఉంటుంది. పెద్దలకు రూ.5000, పిల్లలకు రూ.2510 చార్జీగా నిర్ణయించారు. టికెట్లు ఆన్‌లైన్‌లో tgsrtcbus.in ద్వారా 99599 సర్వీస్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఇంకా వివరాలకు 9866619189 లేదా 9542698518 నెంబర్లను సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో విలేజ్ బస్ ఆఫీసర్ కిన్నెర ఆనందరావు, అశ్వారావుపేట కంట్రోలర్ ఆర్.వి.రావు, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు.