ఖమ్మం,మహా.
వినియోగదారులకు నిరంతరంగా, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఖమ్మం సర్కిల్లో ఇంటర్ లింక్ లైన్ల ఏర్పాటు చేస్తున్నట్లు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాసాచారి తెలిపారు.
ఇప్పటికే సర్కిల్ పరిధిలో ఉన్న 125 విద్యుత్ ఉప కేంద్రాల్లో 36 ఇంటర్ లింక్ లైన్లు ఏర్పాటు చేశామని, ఇంకా 14 కేంద్రాల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు. అదనంగా మరో 5 లైన్లను గుర్తించి, వాటిలో కూడా త్వరలో ఏర్పాట్లు చేస్తామని వివరించారు.
ఈ వ్యవస్థ వల్ల ఏదైనా లైన్లో లేదా ఉప కేంద్రంలో విద్యుత్ అంతరాయం వచ్చినా, పక్కనున్న మరో లైన్ లేదా కేంద్రం నుంచి ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా చేయడం సులభమవుతుంది. దీని ద్వారా విద్యుత్ నిలిపివేతలు లేకుండా వినియోగదారులకు ఎప్పటికప్పుడు విద్యుత్ అందించే అవకాశం కలుగుతుంది.
అదే విధంగా పదకొండు వేల్ట్ లైన్లను కూడా అనుసంధానించే పనుల్లో ఉన్నామని, అవసరమైన చోట్ల ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవల కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.








