Mahaa Daily Exclusive

  ఇల్లందు సి ఐ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలి – ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర స్పష్టీకరణ..!..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (మహా):
భర్త చేతిలో మోసపోయిన ఒక ఆడబిడ్డకు న్యాయం చేయాలని భావించి, తన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భర్త బంధువులను కౌన్సిలింగ్ కు పిలిస్తే కౌన్సిలింగ్ కు వచ్చిన వారిపట్ల దురుసుగా ప్రవర్తించారని ఎటువంటి ఆధారాలు లేకుండా, ఏ చిన్న ఆరోపణలు లేకుండా నిజాయితీ గల ఇల్లందు సీఐని సస్పెండ్ చేయడం చాలా దారుణం అని ఆదివాసి ఐకాస రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర స్పష్టం చేశారు. న్యాయం కోసం ఆశ్రయించే మహిళల పట్ల పోలీసు ఉన్నతాధికారులు మోసపోయిన మహిళకు న్యాయం చేయకపోగా ఒక మోసగాడిని సపోర్ట్ చేస్తున్న ఈ పోలీసు ఉన్నతాధికారులను ఏం చేయాలో ప్రభుత్వాలే నిర్ణయించాలన్నారు. సి.ఐ సత్యనారాయణ సస్పెన్షన్ పోలీస్ ఉన్నతాధికారుల తొందరపాటుగా తాము భావిస్తున్నామని, సి ఐ సత్యనారాయణ ఏజెన్సీ భద్రాద్రి జిల్లాలో కేసుల విషయంలో మహిళాల విషయంలో ఎక్కడ పొరపాటు చేసిన దాఖలాలు లేవని, ప్రజలతో ప్రెండ్లీ పోలీసింగ్ గల వ్యక్తి అని,ఆయన మీద ఉన్న సస్పెన్షన్ ఎంత మాత్రం సరి కాదని వెంటనే సస్పెన్స్ ను వెంటనే ఎత్తివేసి అక్కడే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేసారు.