Mahaa Daily Exclusive

  గ్రోమోర్‌లో రైతులకు అన్ని రకాల సేవలు కారేపల్లి గ్రోమోర్‌ స్టోర్‌ ప్రారంభం..!

Share

కారేపల్లి, మహా : రైతులకు గ్రోమోర్‌ సెంటర్‌లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచినట్లు ఆసంస్ధ తెలంగాణ జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కారేపల్లి మన గ్రోమోర్‌ స్టోర్‌ను రైతులతో ప్రారంభింపచేశారు. ఈసందర్భంగా మనగ్రోమోర్‌ మేనేజర్‌ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు మన గ్రోమోర్‌లో లభిస్తాయన్నారు. కోనుగోలు చేసిన ప్రతి వస్తువుకు భీమా సౌకర్యం ఉంటుందన్నారు. రైతులు పంటలకు మందులను పిచికారి చేసేందుస్త్ర డ్రోన్‌ పరికరాలను అందుబాటులో ఉంచామన్నారు. ఎకరాకు రూ.400 చెల్లించి డ్రోన్‌తో పురుగుమందులను పిచికారి చేసుకోవచ్చన్నారు. గ్రోమోర్‌లో కొనుగోలు చేసిన వస్తువులను 30 కిలోమీటర్ల పరిధిలో ఉచితంగా డెలివరి చేస్తామన్నారు. రైతులు భూసార పరీక్షలు చేసుకునేందరు అవకాశం సైతం కల్పించామన్నారు. మన గ్రోమోర్‌ స్టార్‌ను రైతులు వినియోగించుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు కన్వీనర్‌ హన్మకొండ రమేష్‌, సోసైటీ మాజీ డైరక్టర్‌ అడపా పుల్లారావు, గ్రోమోర్‌ ఏరియా రీజనల్‌ మేనేజర్‌ సంతోష్‌ కుమార్‌, స్టోర్‌ మేనేజర్‌ మహేష్‌, ఆర్‌ఎసి జనార్ధన్‌, రైతులు,స్థానిక వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.