Mahaa Daily Exclusive

  కారేపల్లి పెద్దచెరువులో అక్రమ తవ్వకాలపై పిర్యాదు ఎమ్మెల్యే జోక్యంతో నిలిచిన తవ్వకాలు..!

Share

కారేపల్లి, మహా : కారేపల్లి పెద్ద చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతుండటంతో గ్రామస్తులు అధికారులతోపాటు వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌కు పిర్యాదు చేశారు. అధికారుల అనుమతులు లేకుండానే మట్టి మాఫియా మాఫియా ఇష్టానుసారంగా చెరువులో తవ్వకాలు చేపడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులో మట్టి తవ్వకాలు చేపట్టద్దని మత్స్యకార సొసైటీ సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ ఫోన్‌లో వివరించారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే రాందాస్‌ నాయక్‌ నీటిపారుదల శాఖతోపాటు రెవెన్యూ అధికారులతో మాట్లాడి అనుమతులు లేకుండా చేపడుతున్న మట్టి త్రవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని తవ్వకాలను నిలిపివేశారు.