Mahaa Daily Exclusive

  సీజ్ చేసిన మెడికల్ షాపు దగ్ధానికి కారుకులైన వారిని గుర్తించి శిక్షించాలి..!

Share

బోనకల్ మహా.27
మండల పరిధిలోని గోవిందపురం (L) గ్రామంలో గురువారం. ది 26-06-2025 జరిగిన సంఘటన..
సంవత్సరం క్రితం రూల్స్ కు వ్యతిరేకంగా నడుపుతున్న వెంకట గాయత్రి మెడికల్ షాప్ ను అధికారులు
తనిఖీ చేసి ది 15-05-2024 న
ఆ షాపు సీజ్ చేసి
అట్టి షాప్ యజమాని కళ్యాణపు కిరణ్ కుమార్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది.
ప్రస్తుతం గురువారం నాడు అట్టి మెడికల్ షాపు, షార్ట్ సర్క్యూటా లేదా ఎవరైనా తగలబెట్టారు అనేది పోలిసులు సమగ్ర విచారణ జరిపించి
అసలైన నిందితులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని
కోరుతున్నాము. అలాంటి దురదుష్టమైన సంఘటణలను
ఆసరా చేసుకొని కొంత మంది సంఘ విద్రోహ శక్తలు వారి యొక్క
రాజకియ లబ్ధి కోసం. ఇటువంటి సంఘటనకు సంబంధం లేని
వక్తలను దీనిలోకి లాగి, వారి యొక్క వ్యక్తిత్వాన్ని మరియు వారి
యొక్క మనోభావాలను దెబ్బతీయడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి చర్యలు చాలా నీచమైనవి. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారికి తొందరలోనే ప్రజలు బలంగా బుద్ధి చెప్పే రోజులు వస్తాయి