కారేపల్లి, మహా : కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మిక చట్టాలను పునరుద్దించాలని డిమాండ్ చేస్తూ జూలై 9న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గంటున్నట్లు ఆశా వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కారేపల్లి మండల వైద్యాదికారి డాక్టర్ బీ.సురేష్‌కు సమ్మెనోటీస్ అందజేశారు. ఈసందర్భంగా సీఐటీయు మండల కన్వీనర్ కే.నరేంద్ర మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను తీసుకరావటంతో కార్మికులకు ఉద్యోగ భద్రత కరువుతుందని, పని గంటలు పెరిగి వెట్టి ముందుకు వస్తుందన్నారు. స్కీమ్ వర్కర్లు అయిన ఆశాలకు స్ధిరమైన కనీస వేతనం నిర్ణయించకుండా మోసం చేస్తుందన్నారు.దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయటం ద్వారా కార్మిక శక్తి చాటుదామన్నారు. ఈకార్యక్రమంలో హెల్త్ వర్కర్ యూనియన్ జిల్లా నాయకులు ఎల్లెబోయిన రాధ, మండల అధ్యక్షకార్యదర్శులు వాంకుడోత్ కమల, జంగ కళ్యాణి, నాయకురాళ్లు సీహెచ్.పుష్పలత తదితరులు పాల్గొన్నారు.








