Mahaa Daily Exclusive

  రుద్రంపూర్ ఐటిఐ కళాశాలలో శిక్షణ పొందుతున్న గిరిజన యువతకు వెల్డింగ్ మెషిన్స్, టూల్ కిట్స్ ను అందజేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ..!

Share

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 27 (మహా):
స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్ స్కీం ద్వారా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఐటిఐ కళాశాలలో పలు వృత్తులలో నైపుణ్యం సాధించిన యువకులకు వెల్డింగ్ మెషిన్స్, టూల్ కిట్స్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తమ చేతులు మీదుగా అందజేశారు. మొత్తం 10 యూనిట్లను అందజేయడం జరిగింది. ఒక్కో యూనిట్ ధర 55 వేల రూపాయలని తెలిపారు. ఐ.టి.ఐ.కాలేజీ, రుద్రంపూర్ నందు వెల్డింగ్ వర్క్ షాప్ లో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ స్కీమ్ (ఎస్ ఎస్ ఎ) ద్వారా గత నెలలో కాట్స్, చైర్స్ మరియు టేబుల్స్ (ఫర్నిచర్) ను వెల్డింగ్ వృత్తిలో నైపుణ్యం పొందిన గిరిజన యువతతో తయారు చేయించడం జరిగిందని, కళాశాల యాజమాన్యం మరియు అధికారులు ఎస్పీకి వివరించారు. ఆ ఫర్నిచర్ ను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు,వెల్డింగ్ మిషన్స్ మరియు టూల్ కిట్స్ ను వెల్డింగ్ ట్రైనీస్ కు అందచేసారు. అనంతరం ఐటిఐ కళాశాల నందు గల మెకానికల్, ఎలక్ట్రికల్, ఫిట్టర్ మరియు తదితర విభాగాలను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుండే సరైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని క్రమశిక్షణతో మెలిగితే జీవితంలో విజయం సాధిస్తారని సూచించారు. ఎలాంటి చెడు వ్యసనాల జోలికి వెళ్లకుండా, మంచి స్నేహితులను ఏర్పరుచుకుని తాము నిర్దేశించుకున్న గమ్యం వైపు అడుగులు వేయాలని తెలిపారు.వృత్తి నైపుణ్యంతో జీవితంలో విజయం సాధించి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. జిల్లాలోని ఆదివాసీ,గిరిజన యువత అభివృద్ధి వరకూ పోలీస్ శాఖ కూడా అన్ని రకాలుగా కృషి చేస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ బి సి వెల్ఫేర్ ఆఫీసర్ ఇందిరా, కొత్తగూడెం డీస్పీ రెహమాన్ , ఐ.టి.ఐ కాలేజీ ప్రిన్సిపాల్, డి ఆర్ డి ఎ డి పి ఎం వెంకయ్య, ఐ.టీ.ఐ కాలేజీ స్టాఫ్ మరియు వెల్డింగ్ ట్రైనీస్ పాల్గొన్నారు.