మహా భద్రాచలం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దార్తి అబాజాన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ యోజన క్యాంపులు ఐటీడీఏ ఏజెన్సీ ఏరియా పరిధిలో 07 మండలాలలో 10 గ్రామాలలో క్యాంపులు నిర్వహించి సంబంధిత అధికారుల ద్వారా గ్రామసభలలో గిరిజనులు వివిధ పథకాలకు సంబంధించిన కార్డుల రిపోర్టు అధికారుల ద్వారా తెప్పించడం జరిగిందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.
ఏజెన్సీ ఏరియా పరిధిలోని అశ్వాపురం, అశ్వరావుపేట, చర్ల, గుండాల, టేకులపల్లి, కరకగూడెం, లక్ష్మీదేవి పల్లి మండలాలలో 07 సదస్సులు నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సులకు 1287 మంది గిరిజనులు పీఎం కిషన్, ఆధార్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, జన్ధన్, కులం సర్టిఫికెట్లు, ఎన్ఆర్ఈజీఎస్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారని, 352 మంది పేర్లు నమోదు చేయడం జరిగిందని ఆయన అన్నారు.
వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, తాసిల్దారులు, మరియు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, పంచాయతీ సెక్రటరీలు మీసేవ సెంటర్ ప్రతినిధుల ద్వారా రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేయించడం జరిగిందని ఆయన అన్నారు.








