కూసుమంచి, జూన్ 28, మహా:
హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన భవనంలో గురువారం శ్రీ సేవాలాల్ సేన రాష్ట్ర మహాసభ జరిగాయి. ఈ మేరకు సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ సెక్రటరీగా కూసుమంచి మండలం, ధర్మతండా నివాసి జర్పుల లాలు ప్రసాద్ ను నియమించారు. ఈ మేరకు కమిటీ అధ్యక్షుడు బానోతు హుస్సేన్ నాయక్ నియామక పత్రాన్ని శనివారం లాలు కు అందజేశారు. వారి ఎన్నిక పట్ల ధర్మ తండా ప్రజలు, పాలేరు నియోజకవర్గ బంజారా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఒక చిన్న గిరిజన తండాలో పుట్టి పెరిగి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎంఈడి, ఎంసిజే విద్యార్హతలు పొంది బంజారా జాతి హక్కుల సాధనలో తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా గతంలో అనేక పోరాటాలు చేసి ఈరోజు రాష్ట్ర కమిటీ సెక్రటరీగా ఎన్నిక కావడం ధర్మతండా గ్రామానికి గర్వకారణంగా గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మహాసభలో లాలూ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజన జాతికి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని లంబాడి ఎమ్మెల్యేలకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలని,మైదాన ప్రాంతంలో కూడా ఐటీడీఏల శాఖలను ఏర్పాటు చేయాలని, లంబాడాలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని, జీవో నెంబర్ 3ను పునరుద్దించాలని, శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రెండు కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ నాయక్,రాష్ట్ర ఇన్చార్జి సైదా నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు బానోతు హుస్సేన్నాయక్, ఇతర గిరిజన నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగాన్ని పురస్కరించుకొని కూసుమంచి మండల సేవాలాల్ సేన వ్యవస్థాపకులు తేజావత్ భాస్కర్, పాలేరు నియోజకవర్గ సేవలాల్ జయంతి ఉత్సవాల కోఆర్డినేటర్ జర్పుల భద్రు నాయక్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.








