Mahaa Daily Exclusive

  ప్రయోగశాలలు నిర్వహణ పట్ల అసంతృప్తి -ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ..!

Share

భద్రాద్రి కొత్తగూడెం,జూన్ 28(మహా)
పాఠశాలల్లో ప్రయోగశాలల నిర్వహణ ఆశించిన స్థాయిలో ఉండటం లేదని, దీనివల్ల విద్యార్థులు శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉందని శిక్షణా కలెక్టర్, సౌరబ్ శర్మ, అన్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చండ్రుగొండ, మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుజాతనగర్ లలో ఉన్న అటల్ టింకరింగ్ ల్యాబ్ మరియు సాధారణ ప్రయోగశాలలను సందర్శించిన ఆయన వీటి నిర్వహణ పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వీటిని సక్రమంగా నిర్వహిస్తూ విద్యార్థులలో ఆశించిన సామర్థ్యాలు రాబట్టవచ్చని అన్నారు.
ఈ ప్రయోగశాలలో సక్రమంగా నిర్వహించకపోవడం పట్ల ప్రదానోపాధ్యాయులతో మాట్లాడుతూ, విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ప్రయోగశాలలు ఎంతగానో ఉపయోగపడతాయని, అటువంటి ప్రయోగశాలల నిర్వహణ సరిగ్గా ఉన్నప్పుడే విద్యావ్యవస్థ చక్కగా ఉంటుందని అందువల్ల ఈ ప్రయోగశాలలను సక్రమంగా నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, ప్రయోగశాలలకు ఇంకా ఏమైనా పరికరాలు అవసరమైతే తనను సంప్రదించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

అదేవిదంగా ఆయా పాఠశాలల్లోని 10వ తరగతి విద్యార్థులతో ట్రైనీ కలెక్టర్ కాసేపు ముచ్చటించారు.
సబ్జెక్టు పట్ల వారి అవగాహనను పరిశీలించారు.
ఈ సందర్బంగా చంద్రుగొండ ఉన్నత పాఠశాల ఆవరణలో ట్రైనీ కలెక్టర్ మొక్కను నాటారు.

ఈ సందర్శన లో శిక్షణ కలెక్టర్ తో పాటుగా జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు యస్. కె. సైదులు, నాగ రాజశేఖర్ ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.