Mahaa Daily Exclusive

  నేడు దుర్గమ్మకు తెలంగాణ బోనం..!

Share

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు ఆదివారం తెలంగాణ బోనం సమర్పించనున్నారు. హైదరాబాద్ లోని శ్రీ భాగ్యనగర్ మహంకాళీ జాతర అమ్మవారి బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. సుమారు 200 మందితో బేతాల నృత్యాలు, తీన్మార్ డప్పులతో తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ ఊరేగింపు జరుగుతుంది. ప్రతిఏటా ఆషాఢ మాసంలో బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ.