Mahaa Daily Exclusive

  మంత్రిని కలిసిన ఐఎన్ టియూసి, ఆటో యూనియన్ సంఘాల నాయకులు..!

Share

ఓఆర్ఆర్ లోపల ఎలక్ట్రిక్ , సీఎన్జీ, ఎల్ పిజి అటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐఎన్ టియూసి కార్మిక సంఘాలు, ఆటో యూనియన్ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 65 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడంతో ఆదివారం ఉదయం మినిస్టర్ క్వార్టర్స్ లో హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఐఎన్ టియూసి కార్మిక సంఘాలు మరియు ఆటో యూనియన్ సంఘాలు కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.