Mahaa Daily Exclusive

  ఆదిలాబాద్ లో బిఆర్ఎస్ బిజెపి పొత్తు..! త్వరలో విలీనం కానున్న రెండుపార్టీలు..!

Share

(హైదరాబాద్, వేదిక)

బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య పొత్తు పొడిచింది. ఆదిలాబాద్ లో రెండుపార్టీలు కలిసి కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసానికి దిగి కలిసి ఓట్లేశాయి. ఫలితంగా అవిశ్వాసం నెగ్గింది. రెండుపార్టీలు బహిరంగంగా పొత్తుకు దిగడం ఇదే తొలిసారి. బిజెపిలో బీఆర్ఎస్ విలీనం పొత్తులపై చర్చలు జరుగుతున్న తరుణంలో ఆదిలాబాద్ నుండే రెండుపార్టీలు ఈ కలయికకు నాంది పలకడం గమనార్హం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా పొత్తులపై చర్చలు జరుగుతుండగా, ఆదిలాబాద్ లో పట్టుబట్టి బిఆర్ఎస్, బిజెపిలు వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం పెట్టి నెగ్గించుకున్నాయి. బిజెపితో పొత్తులు, విలీనంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్పందించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని ఆగ్రహం ప్రదర్శించారు. ఇద్దరి పొత్తు రాజకీయాలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి.
………….