Mahaa Daily Exclusive

  రైతుల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రాయపోలులో ఎరువుల కొనుగోలు గోదాం ప్రారంభం రైతులకు అందుబాటులో అన్ని రకాల ఎరువులు ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
రాచకొండమైలారం ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన నూతన గోదామును ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో రాచకొండ మైలారం పిఎసిఎస్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎరువుల కొనుగోలు గోదామును ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాచకొండ మైలారం పిఎసిఎస్ పరిధిలోని గ్రామాల రైతులకు, వ్యవసాయానికి సంబంధించిన ఎరువులను అందుబాటులో ఉండేలా కొనుగోలు గోదామును నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. భవిష్యత్తులో రైతులకు కావాల్సిన సాయ సహకారాలు సదుపాయాలు అందించడం జరుగుతుందని, రైతులు నాణ్యమైన, అధిక దిగుబడి వచ్చి పంటలు వేసి, మంచి రాబడిని అందుకోవాలని రైతులకు ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇప్పటికే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని, అలాగే తొమ్మిది రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా అందించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అభివృద్ధి చెందేలా కోరుకుంటున్నానని అన్నారు. అలాగే రైతు కూలీలను కూడా ప్రభుత్వ ఆదుకొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బిట్ల వెంకట్ రెడ్డి, ఏదుల పాండురంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి భూపతిగళ్ల మహిపాల్, జిల్లా సేవల అధ్యక్షులు మంకాల దాసు, ఏఎంసి వైస్ చైర్మన్ మంకాల కర్ణాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యాల రాజశేఖర్ రావు, జంగారెడ్డి, మండల వ్యవసాయ అధికారి విద్యాదారి, పలు శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Latest