Mahaa Daily Exclusive

  ఇబ్రహీంపట్నం ఎంఈఓ ఆఫీస్ కు తాళం మధ్యాహ్న భోజన నిధులు విడుదల చేయాలి లేనిపక్షంలో ఎంఈఓ కార్యాలయానికి తాళం తీసేదలే మండల మధ్యాహ్న భోజన కార్మికులు ..!

Share

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి కార్యాలయానికి తాళం వేసిన మధ్యాహ్న భోజన కార్మికులు. మధ్యాహ్న భోజన కార్మికులకు 9, 10వ తరగతుల గుడ్ల పెండింగ్ బిల్లులు 10 నెలల నుండి ఇవ్వని ప్రభుత్వం, వెంటనే ఇవ్వాలని మధ్యాహ్న భోజన రాష్ట్ర అధ్యక్షులు యెలామోని స్వప్న డిమాండ్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… గత సంవత్సర కాలం నుండి 9 10 తరగతి విద్యార్థులకు అందించిన గుడ్ల బిల్లులు పెండింగ్లో ఉండడం జరిగింది. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎంఈఓ ఎస్ టి ఓ కలెక్టరేట్ కార్యాలయాల్లో చుట్టూ తిరిగిన ఫలితం లేకపోవడంతో ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో ఉన్న మండల విద్యాధికారి కార్యాలయానికి మధ్యాహ్న భోజన కార్మికులు తాళం వేసి నిరసన చేపట్టారు. మా బిల్లులు విడుదల చేసే వరకు కార్యాలయానికి తాళం తీసేదే లేదని తెగేసి చెప్పారు. సంవత్సర కాలం నుండి అప్పులు చేసి విద్యార్థులకు పోస్కరమైన ఆహారాన్ని పౌష్టికరమైన ఆహారాన్ని అందించిన మాకు బిల్లులు అందక ఆర్థిక అభివృద్ధిలో పరిస్థితులు ఆగమ్యగోచరంగా మారాయని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ కన్వీనర్ సిహెచ్ ఎల్లేశ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు తరంగ్, బిఆర్ఎస్వి విద్యార్థి విభాగ అధ్యక్షులు నిట్టు జగదీష్, మధ్యాహ్న భోజన కార్మికులు, భీమమ్మ, మంజుల, కల్పన, మార్తా జయమ్మ, సుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు.

Latest