రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
గ్రామ స్వరాజ్యం స్థాపన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. గురువారం మంచాల మండల పరిధిలోని, లింగంపల్లి, తాళ్లపల్లిగూడ తిప్పాయిగూడ, చిత్తాపూర్, రంగాపూర్, చీదేడు గ్రామాల్లో పర్యటించినఆయన రూ.108.50 లక్షల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గత పదేళ్ల కాలంలో మంచాల మండలాన్ని అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని, ఏ ఒక్క గ్రామంలో అభివృద్ధి జరుగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే అత్యధిక నిధులు తీసుకొచ్చి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలను అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచి గ్రామ స్వరాజ్యం స్థాపించడమే లక్ష్యంగా ముందుకెళ్తామని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, మంచాల, ఉప్పరిగూడ సహకార సంఘం చైర్మన్లు ఏదుల పాండురంగారెడ్డి, వెదిరే హనుమంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, భూపతిగల్ల మహిపాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యాల రాజశేఖర్ రావు, గుండమోని జయమ్మ, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వింజమూరి రాంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరిక రమాకాంత్ రెడ్డి, చీమల జంగయ్య యాదవ్, వింజమూరి ప్రేమాకర్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, భరత్ రెడ్డి, మార సురేష్ ఎంపీడీఓ బాలశంకర్ ఎమ్మార్వో ప్రసాదరావు పంచాయతీ రాజ్ డీఈ ఇంద్రసేనారెడ్డి ఏఈ మల్లారెడ్డి తదితర అధికారులు నాయకులు పాల్గొన్నారు.








