వరంగల్ మహా;
వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ వారు పలు కేసులలో నేరస్తుడిగా ఉండి, తప్పించుకుని తిరుగుతున్న రౌడీ షీటర్ ఆడెపు అనిల్ @ గుమ్మా , నివాసం కరీమాబాద్ కు చెందిన నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. ఈ నిందితుడి పై హత్య , హత్య ప్రయత్నం, దారి దోపిడీ ( రాబరీ ) వంటి తీవ్రమైన నేరాలతో పాటు, పలు దాడి కేసులు బెదిరింపుల కేసులలో నిందితుడు. వరంగల్ తో పాటు హైదరాబద్ లో కూడా అతను పలు నేరాలు చేసాడు. ఇతని మీద త్వరలోనే పీడీ చట్టం కూడా మోపటానీకి ఏర్పాటు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ తెలిపారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్స్ అందరూ సత్ప్రవర్తన తో ఉండాలని, వారి మీద అనుక్షణం నిఘా ఉంచామని, ఏ చిన్న నేరం చేసిన జైలుకి పంపించడమే కాకుండా పీడీ చట్టం ప్రయోగిస్తామని ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ హెచ్చరించారు. అలాగే ప్రజలు తమ దృష్టి కి వచ్చే అసాంఘిక కార్యకలాపాల గురించి వెంటనే పోలిసులకు తెలియజేయాలని, రౌడీ షీటర్స్ గురించి భయపడాల్సిన అవసరం లేదని ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్ స్పష్టం చేశారు.








