రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
ఆక్టోపస్ లోని థర్డ్ బెటాలియన్ విభాగంలో పోలీస్ అధికారులతో కలిసి రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణ పనులకు కృషి చేస్తానని అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఆక్టోపస్ లోని థర్డ్ బెటాలియన్ పోలీస్ విభాగంలో ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పోలీసుల గౌరవ వందనం పొందిన, అనంతరం నాగన్ పల్లి మెయిన్ రోడ్డు నుండి థర్డ్ బెటాలియన్ కార్యాలయం వరకు నూతన రోడ్డు పనులను పోలీస్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… సమాజంలో ప్రజల భద్రత, చర్యలు, కాపాడటంలో పోలీసులే కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. రక్షణ శాఖలో విధులు నిర్వహించే పోలీసులకు కనీస సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. ఆక్టోపస్ లోని బెటాలియన్ పోలీసులు ఎదుర్కోంటున్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు. నాగన్ పల్లి రోడ్డు నుండి బెటాలియన్ కార్యాలయం వరకు హెచ్ఎండిఏ నిధులతో రోడ్డు నిర్మాణ పనులు, రోడ్డుకు ఇరువైపులా చెట్లతో సుందరీకరణ చేయించడం జరుగుతుందని పోలీసులకు హామీ ఇచ్చారు. త్వరలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెటాలియన్ ఆఫీసర్ కమాండెంట్ జమీల్, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ పాండురంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి భూపతిగల మహిపాల్, మాజీ ప్రజా ప్రతినిధులు, బెటాలియన్ పోలీస్ అధికారులు, కానిస్టేబుల్ పాల్గొన్నారు








