Mahaa Daily Exclusive

  సోతుకు రత్న జానకి మరిన్ని సంపుటీలు రచించాలి ..!

Share

మందమర్రి, మహా : రచయిత్రి
సొత్కు రత్న జానకి మరిన్ని సంపుటీలు రచించాలని సినీ ,టివి గేయ రచయిత మల్లిక్ పేర్కొన్నారు. ఆదివారం మందమర్రి సింగరేణి సి.ఈ.ఆర్. క్లబ్ లో సొతుకు రత్నజానకి రచించిన “సృష్టిసాక్ష్యాలు” చిత్రకవితా సంపుటిని, ఆయన ఆవిష్కరించారు. ఇదే కాకుండా ఇంతకు క్రితం 2023లో “మాకూ ఉన్నాయి రెక్కలు” వచనకవిత్వాన్ని మంచిర్యాలలో,రచయిత,
కాలమీస్ట్ అన్నవరం దేవేందర్ ఆవిష్కరించడం జరిగిందని వెల్లడించారు. 2024లో లఘుప్రక్రియలో 500 శ్రీపదాలను రచించిన “మనోహరాలు”
రెండవ సంపుటిని గోదావరిఖనిలో కలెక్టర్ చేతులమీదుగా ఆవిష్కరించారని
తెలిపారు. ఈ కార్యక్రమంలో
దండనాయకుల వామనరావు, అల్లాడి శ్రీనివాస్ ,తోకల రాజేశం,నీళాదేవి,నోముల చంద్రశేఖర్,లైన్స్ క్లబ్ మెంబర్స్ రత్నం , పోల్ శ్రీను,సుదర్శన్ ,సతీష్,కౌట్ల అనిత పాల్గొన్నారు. అంతరం పుస్తక రచయిత రత్న జానకిని, ముఖ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.