ఆదిలాబాద్ మహా : ఆపత్కాలంలో అత్యవసర సమయాలలో తన ఫౌండేషన్ సేవలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయని కంది శ్రీనివాస రెడ్డి చెబుతుంటారు. అన్నట్లుగానే శనివారం వర్ష బీభత్సానికి నీటమునిగిన కాలనీలకు కనీసం వండుకునే స్థితిలో లేని కుటుంబాలకు తన ఫౌండేషన్ సభ్యులు ,కాంగ్రెస్ కార్యకార్తలచే ఆహారం పంపిణీ చేయించారు. పట్టణంలోని పలు కాలనీలలో దాదాపు 5 వందల మందికి ఆహారం పంపిణీ చేసినట్టు సభ్యులు తెలిపారు. అలాగే నేటి ఉదయం కూడా ఇంకా లోతట్టు ప్రాంతాలకు చెందిన వారి ఇళ్లల్లో వండుకునే స్థితి లేదని తెలిసి అల్పాహారం పంపిణీ చేయించారు.వాన ,వరద తాకిడికి ఇళ్లలోకి నీరు చేరి ఎన్నో కుటుంబాలు కలితో ఇబ్బందులు పడకూడదని కంది శ్రీనివాస రెడ్డి ఆహారం పంపించినట్టు సభ్యులు తెలిపారు. ఆపద సమయంలో అండగా నిలుస్తున్న కంది శ్రీనివాస రెడ్డి కి బాధితులు ధన్యవాదములు తెలిపారు.








