వరంగల్ మహా;
గ్రేటర్ వరంగల్ నగరం ముంపుకు గురికాకుండా ప్రణాళికా ప్రకారం శాశ్వత చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేకాధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక అధికారులను ఆదేశించారు.
ఆదివారం బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ విభాగాలకు చెందిన అధికారులతో కలిసి భద్రకాళి బండ్,చిన్న వడ్డేపల్లి చెరువు, ఐసిసిసి కేంద్రాల్లో క్షేత్ర స్థాయి పర్యటించి సమర్థవంతంగా వరద ముంపు ను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు పలు సూచనలు చేశారు.
భద్రకాళి చెరువు సమీపంలో ముంపు గురయ్యే ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, బృందావన కాలనీ తదితర లోతట్టు ప్రాంతాల్లో ముంపు గురయ్యే ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, సంతోషిమాత కాలనీ గురించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడినుండి 12 మోరీల వద్ద వరద నీటి ప్రవాహం పరిశీలించి, అనంతరం చిన్న వడ్డపల్లి చెరువును పరిశీలించి కట్ట మల్లన్న చెరువు నుండి వచ్చే వరద నీటి వల్ల చిన్న వడ్డపల్లి చెరువును ముంపునకు గురయ్యే సమీప ప్రాంతాలు ఎస్ ఆర్ నగర్, సాయి గణేష్ కాలనీ, ప్రజలను సురక్షితంగా పునరావస కేంద్రాలకు తరలించడం, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భం గా ప్రత్యేక అధికారి శశాంక మాట్లాడుతూ
నగరం లో వరద నీటి తీవ్రత స్థాయి అంచనాకు వివిధ విభాగాలు సమన్వయం తో పనిచేయాలని అన్నారు. వరద నీటి తీవ్రత, స్థాయిని అంచనా వేయాల్సిన అవసరం ఉందని, నగరం లోని లోతట్టు ప్రాంతాలు ముంపు కు గురికాకుండా భద్రకాళి బండ్ ఇన్ లెట్ వద్ద వాస్తవ సామర్థ్యం ఎంత? ఎంత ఇన్ ఫ్లో వస్తుంది ? ఎంత ఔట్ ఫ్లో వెళుతుంది? లెవెల్స్ ఇంత ఖచ్చితం గా ఉన్నప్పటికీ ఎందుకు ఔట్ ఫ్లో వెళుతుంది? వంటి విషయాల అధ్యయనానికి ఇరిగేషన్, బల్దియా, ఇంజనీరింగ్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాలు సమన్వయం తో స్ట్రీమ్ లైన్ చేసుకోవాలని సక్రమంగా లెవెల్స్ , సామర్ధ్యాన్ని నిర్వహిస్తూ ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో కు అనుగుణం గా ఎలాభద్రకాళి నిల సామర్థ్యాన్ని పెంచి వరద ముంపు కు గురికాకుండా నీటిని నిలువరించేలా చర్య లు చేపట్టాలని అన్నారు. గ్రీన్ ఏరియా లోకి నీరు చేరకుండా చూడడం తో పాటు లోతట్టు ప్రాంతాలకు వరద ప్రభావితం కాకుండా చూడాలని, నీరు ప్రవహించే గరిష్ఠ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైన్ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు.
చిన్న వడ్డేపల్లి ప్రాంతాన్ని సందర్శించారు. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసే క్రమంలో కట్ట మల్లన్న చెరువు నుండి చిన్న వడ్డేపల్లి చెరువుకు నీరు చేరే క్రమంలో మధ్యలో గల లోతట్టు ప్రాంతాల్లో ప్రధాన డ్రైన్ లు, స్ట్రాం వాటర్ డ్రైన్ లు లేకపోవడం వల్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని అంతే కాకుండా ఇన్ ఫ్లో వచ్చినప్పుడు గేట్ లెవెల్స్ మేంటెన్ చేస్తూ వంద ఫీట్ల రోడ్ లో ఉన్న ఎస్ ఆర్ నగర్ ప్రాంతం లో అధిక సామర్ధ్యం తో మేజర్( పెద్ద) డ్రైన్స్ నిర్మిస్తే సహజ ప్రవాహం ఎప్పటికపుడు వెళ్ళిపోయే అవకాశం ఉందని అన్నారు.
అనంతరం బల్దియా ప్రధాన కార్యాలయం లో గల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తూ వర్షాకాలం నేపద్యం లో నగరం లోని ప్రతి చెరువుకు సంబంధించి నీటి ప్రవాహం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కు సమాచారం ప్రతి వార్డు ను ఎప్పటికపుడు అప్రమత్తం చేసే సమాచారం వెళ్లేల ఐ సి సి సి కు అనుసంధానం చేస్తూ వాతావరణం లో సంభవించే మార్పులను ఆలారం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ కేవలం చేయాలని వరద నీటి ప్రత్యేకాధికారి అన్నారు.
అంతకు ముందు నగరానికి చేరుకున్న ప్రత్యేకాధికారిని బల్దియా కమిషనర్ మర్యాదపూర్వకం గా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమం లో సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి ఇంచార్జి ఎస్ ఈ, సిటీ ప్లానర్ లు మహేందర్, రవీందర్ రాడేకర్, ఏం హెచ్ ఓ డా.రాజేష్, ఈఈ రవికుమార్ వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్, సానిటరీ సూపర్ వైజర్ భాస్కర్ గోల్కొండ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.








