జూలూరుపాడు, ఆగస్టు 17, (మహా): మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, అందరిని అక్కున చేర్చుకొని కంటికి రెప్పల కాపాడుకుంటామని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లేళ్ళ వెంకటరెడ్డి, మంగీలాల్ నాయక్, మధుసూదనరావు, సిరంశెట్టి రామారావు, ధారావత్ రాంబాబు తోపాటు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 129








