కారేపల్లి, మహా: జమ్మూ కాశ్మీర్ దేశ సంరక్షణ లో భాగంగా ఎల్ఓసిలో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ బానోత్ అనిల్ కుమార్ వీరమరణం పొందిన అతనికి రాష్ట్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇవ్వటం లేదని గిరిజన నాయకులు అజ్మీర వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వీరన్న మాట్లాడుతూ
అనిల్ కుమార్ భారత సైన్యంలోని 23మ మరాఠ లైట్ ఇన్ఫెంట్రీ (ఎంఎల్ఐ) బెటాలియన్ లో 13సంవత్సరాల నుండి దేశ సంరక్షణ నిర్విరామంగా సేవలు అందిస్తున్నాడన్నారు. జమ్ము కాశ్మీర్ లో గల శ్రీనగర్ ఎల్వోసీ (లైన్ అఫ్ కంట్రోల్ ) లో సేవలు అందిస్తున్న అనిల్ కుమార్ ఈ నెల 11న కుంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అనిల్ కొండ పై నుండి కిలోమీటర్ లోతు గల లోయలో పడి పోవడంతో మృతి చెందినట్లు తెలిపారు.
దేశం కోసం ప్రాణాలర్పించిన అనిల్ పట్ల వివక్ష
బోర్డర్ ఆపరేషన్ లో సైనికుడు ప్రాణాలు కోల్పోతే అ సైనికుడి డెడ్ బాడీ స్వరాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర గవర్నమెంట్ తరుపున రాష్ట్ర గవర్నర్ గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వారు అందుబాటులో లేకపోతే మినిమం జిల్లా కలెక్టర్ లేదా ఓ క్యాబినెట్ మినిస్టర్ వచ్చి గౌరవ వందనం సమర్పించాలి. ఆ సైనికుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నీ విధాలా సహకారంగా ఉండాలి. ఆర్థికంగా, ఆ సైనికుడి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం స్థలం కేటాయించాలి. కానీ అనిల్ విషయం లో అవేమి జరగలేదని అజ్మీర వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాత్రమే హాజరై నారని అన్నారు ఆపరేషన్ సిందూర్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అగ్నివీర్ మురళి నాయక్ ప్రాణాలు కోల్పోతే ఆ ప్రభుత్వం వారి కుటుంబానికి వెన్ను దన్ను గా ఉండి రూ. కోటి, రూపాయలు వారి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ స్థలం ఇవ్వటంతో పాటు మురళి నాయక్ విగ్రహం సైతం నెలకొల్పడం జరిగిందన్నారు.అనిల్ కుటుంబానికి అండగా లంబాడా సంఘాల ఐక్య కార్యచరణకు పూనుకుంటామని అనిల్ కుటుంబానికి ప్రభుత్వం ఆదుకునేలా పోరాటాని సైతం వెనకాడేది లేదని ఆయన తెలిపారు.








