మణుగూరు, మహా.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బొల్లోజు అయోధ్య కుటుంబాన్ని ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పరామర్శించారు.*
మణుగూరు మండలంలోని రామానుజవరం గ్రామానికి వెళ్లిన మంత్రి పొంగులేటి అయోధ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారి దుఃఖంలో తాను, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
“ప్రజా హక్కుల కోసం ఎప్పుడూ అణగారని ధైర్యం చూపిన కమ్యూనిస్టు యోధుడు అయోధ్య. ఆయన పేరు వామపక్ష ఉద్యమ చరిత్రలో శాశ్వతంగా నిలుస్తుంది. ఆయన మృతి వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు” అని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా కుటుంబాన్ని పరామర్శించారు. అయోధ్య ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి, సీపీఐ నాయకత్వానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.








