వరంగల్ మహా ;
నగరంలో చేపట్టిన ఆయా అభివృద్ధి పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.
సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయ కౌన్సిల్ హాల్లో కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో డివిజన్ల వారీగా పలు పథకాల కింద కొనసాగుతున్న, చేపట్టబోయే, టెండర్ ప్రక్రియలో ఉన్న, కొత్త అభివృద్ధి పనులకు ప్రతిపాదనల సమర్పించవలసి ఉన్న అభివృద్ధి అభివృద్ధి పనులపై డివిజన్ల వారిగా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించి త్వరితంగా చేపట్టుటకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పలు పథకాల కింద నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేయడంతో పాటు
ఇంకను ప్రారంభించని పనులను వెంటనే ప్రారంభించాలని, బల్దియాలోని 66 డివిజన్లో డివిజన్ కు 50 లక్షల రూపాయల చొప్పున స్టాంప్ డ్యూటీ పనులు 15 ఆర్థిక సంఘం ఎస్సీ ఉప ప్రణాళిక జనరల్ ఫండ్ క్రింద మంజూరైన పనులను తక్షణమే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
కొత్తగా నిర్మించే డ్రైన్లు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ల
అభివృద్ధి పనుల ఎస్టిమేషన్ వెంటనే సమర్పించాలన్నారు. రీకాల్ టెండర్లకు పిలిచి పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.
ఈ సమీక్షలో ఇంచార్జ్ ఎస్ ఈ మహేందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతోష్ బాబు, డి ఈ లు రవి కిరణ్ సారంగం రోజా రాణి, ఏఈలు వర్క్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.








