వరంగల్ మహా;
గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేసి నిర్లక్ష్యం వహిస్తున్న ఎమ్మెల్యే మురళి నాయక్ వెంటనే రాజీనామా చేయాలని ఓ ప్రకటనలో ఎం.సి.పి.ఐ.(యు) రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం నాగార్జున డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గడ్డం నాగార్జున మాట్లాడుతూ
కాట్రపల్లి ప్రజలు ఇతర అవసరాల కోసం మండల కేంద్రానికి వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారని రోడ్లు మొత్తం బురద మయం అయ్యాయని, ఎన్ని ప్రభుత్వాలు మారినా కాట్రపల్లి అభివృద్ధి మాత్రం జరగడం లేదన్నారు. కాట్రపల్లి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీ వల్ల అందులో నడిచే లారీలు కేసముద్రం ప్రధాన రహదారిపై తరచుగా నడవడం వల్ల రోడ్డు మొత్తం అస్తవ్యస్తంగా మారిందని, పలుమార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని పక్క గ్రామంలోనే ప్రభుత్వ సలహాదారుడు అయిన వేం నరేందర్ రెడ్డి దృష్టికి కూడా చాలాసార్లు తీసుకెళ్లడం జరిగిందని వారు కూడా నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వర్గ పోరుతో గ్రామాలలో అభివృద్ధి
కుంటుపడిందని అన్నారు. ఇప్పటికైన గ్రామాలను అభివృద్ధి చేసి కాట్రపల్లి కేసముద్రం రహదారి ని తక్షణమే వేయించాలని వారు ఎమ్మెల్యే ను కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.








