Mahaa Daily Exclusive

  వేగంగా ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి జీ డబ్ల్యూ ఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ..!

Share

వరంగల్ మహా ;

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులకు సంబంధిత అధికారులు ప్రాధాన్యత ఇచ్చి
వేగవంతంగా ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం చూపాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం బల్దియా ప్రదాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో
కమిషనర్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తు లను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు.
ఈ సందర్భం గా స్వీకరించిన ఫిర్యాదుల వివరాలు విభాగాల వారిగా ..
1.ఇంజనీరింగ్….15
2.హెల్త్ & సానిటేషన్…..08
3.ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)..13
4.టౌన్ ప్లానింగ్…41
5.హార్టికల్చర్ ..02
6.నీటిసరఫరా..02
మొత్తం 81 గా అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా సి ఎం హెచ్ ఓ డా.రాజారెడ్డి , ఇన్చార్జి ఎస్ ఈ, సిటీ ప్లానర్ లు మహీందర్ రవీందర్ రాడేకర్ వెటర్నరీ వైద్యులు డా. గోపాల్ రావు హెచ్ ఓ లు రమేష్ లక్ష్మారెడ్డి డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి తదితరులు పాల్గొన్నారు