Mahaa Daily Exclusive

  రైతులకు యూరియా సరఫరా పై కలెక్టర్లు దృష్టి సారించాలి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ల తో సమీక్షించిన మంత్రి తుమ్మల .!

Share

వరంగల్ మహా

వానాకాలం పంట సాగుకు అవసరమైన యూరియా రైతులకు చేరేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హైదరాబాద్ సచివాలయం నుంచి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కే.రామ కృష్ణ రావు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు లతో కలిసి యూరియా, ఎరువుల లభ్యత పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలు నుండి వరంగల్, హన్మకొండ కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరిష్, డిసిపి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు జిల్లాలో రైతులకు సరఫరా అయిన యూరియా వివరాలను మంత్రికి వివరించారు.
జిల్లాలో ప్రైవేటు, పిఎసిఎస్ సెంటర్ నిర్వాహకులు యూరియా కొరత సృష్టించినట్లు ఐతే చర్యలు తప్పవని , సెంటర్లపై వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయి అధికారులు నిరతరం పర్యవేక్షించి నివేధికలు సమర్పించాలని మంత్రి ఆదేశించడం జరిగిందన్నారు. జిల్లాలోని తాహసిల్దార్లు ,ఎంపిడివోలు , మండల ప్రత్యేక అధికారులు , పోలీసు అధికారులు యూరియా వాడకం, నిలువల పై పర్యవేక్షణ చేసి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకొంటున్నట్లు కలెక్టర్లు మంత్రికి తెలిపారు.
ఈ సమావేశంలో జెడ్పి సీఈవోలు, జిల్లా వ్యవసాయ అధికారులు, ఆర్డీవోలు, సంబంధిత మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.