Mahaa Daily Exclusive

  ఎన్నటికైనా కేసీఆర్‌కు హరీశ్ రావే వెన్నుపోటు.. ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్..

Share

  • నన్ను కేసీఆర్ పిలిచినా మళ్లీ వెనక్కి వెళ్లేది లేదు
  • 20 మంది అభ్యర్థులను మార్చితే మళ్లీ బీఆర్ఎస్ వచ్చేది
  • కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చి నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు
  • ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్

 

హైదరాబాద్, మహా: ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ కవిత పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజుతోనే రక్తసంబంధాల కన్న రాజకీయాలు ఎక్కువైపోయాయని తాను డిసైడ్ అయ్యాననని చెప్పుకొచ్చారు. సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్ మీ విషయంలో ఎందుకు స్పందించలేదని జర్నలిస్ట్ అడుగగా.. తాను అదే చెబుతున్నానని కేటీఆర్‍పై కేసు వస్తే పార్టీ అంతా అండగా నిలబడుతుంది. మరి నా విషయంలో ఎందుకు నిలబడలేదనేదే నా ప్రశ్న అన్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత కేసీఆర్‌తో మాట్లాడే ప్రయత్నం చేయలేదని తన తల్లితో రోజు మాట్లాడతానన్నారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టాలంటే వనరులు, మనుషులను సమకూర్చుకోవాల్సిందని అందుకోసం కొంత సమయం పడుతుందన్నారు.

 

తన మనసు విరిగిపోయిందని తిరిగి కేసీఆర్ పిలిచినా మళ్లీ వెనక్కి వెళ్లబోయేది లేదని కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా పుట్టింటి మీద ఆడపిల్లలకు కోపం రాదు. ఒకసారి కోపం వస్తే అంత త్వరగా చల్లారదన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదురుగా ఎవరున్నా పోరాటం చేయాల్సిందేనని అది కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా సరేనన్నారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్‍ను కూడా సమ దూరం పాటిస్తామన్నారు. అవతల కేసీఆర్, కేటీఆర్ ఉంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు కూడా ఇవన్నీ వారు ఆలోచించుకోవాల్సింది కదా అన్నారు. హరీష్ రావు, సంతోశ్‍రావు ఎవరి కోటరీ వారికి ఉందని ఆరోపించారు. ఈ కోటరీనుంచి పార్టీ ఎమ్మెల్యేలను, నేతలను కాపాడాల్సిన బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎప్పటికైనా హరీశ్ రావు ముప్పుగానే ఉంటారని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఎన్టీఆర్‍కు చంద్రబాబు నాయుడు ఎలా వెన్నుపోటు పోడిచారని ప్రజలు చెప్పుకుంటారో కేసీఆర్‍కు హరీశ్ రావు అలాగే వెన్నుపోటు పొడిచారని ప్రజలు మాట్లాడుతారన్నారు. కేసీఆర్‍కు హరీశ్ రావు వెల్ విషర్ అని నేను అనుకోవడం లేదని ఈ విషయం కేసీఆర్ అర్థం చేసుకుంటే బాగుంటుందన్నారు.