Mahaa Daily Exclusive

  లొంగిపోయి ప్రజాజీవితంలోకి రావాలి …..మావోయిస్టులకు భూపతి పిలుపు

Share

  • లొంగిపోయి ప్రజాజీవితంలోకి రావాలి
  • మావోయిస్టులకు భూపతి పిలుపు
  • సాయుధ పోరట పంథాకు కాలం చెల్లింది
  • వీడియో రిలీజ్ చేసిన నేత
  • తనను సంప్రదించేందుకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన భూపతి

హైదరాబాద్, మహా : సాయుధ పోరాటాన్ని తాము విరమించామని లొంగిపోయిన మావోయిస్టు కీలక నేత భూపతి తెలిపారు. భూపతి నుండి ఒక వీడియో ఆదివారం మధ్యాహ్నం బయటకు వచ్చింది. ఆ వీడియోలో తనతో పాటు సహచరులు లొంగిపోయిన విధానాన్ని కూడా వివరించారు. ‘‘మావోయిస్టు పంథాలో ఉన్న సహచరులందరు కూడా పోలీసులకు లొంగిపోవాల్సింది’’గా విజ్ఞప్తి చేశారు. ‘‘మీరు కూడా సాయుధ పోరాట మార్గం వదిలేసి ప్రజాస్వామికంగా ప్రజల్లో పనిచేసేందుకు రావాల’’ని పిలుపిచ్చారు. ‘‘మేం ఆయుధాలను విసర్జించినపుడు దాన్ని కొందరు విమర్శించారు, ద్రోహం అన్నారు, కోవర్టు అన్నారు’’ అని ఆవేధనతో చెప్పారు. ‘‘దేశంలో పరిస్థితులు మారాయని, సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లినట్లు’’ భూపతి అభిప్రాయపడ్డారు. దీనిని తమ సెంట్రల్ కమిటీ అంగీరించే పరిస్థితిలో లేదన్నారు. తనపై వస్తున్న విమర్శలను ఖండిస్తున్నట్లు వీడియోలో చెప్పారు. ‘‘తనకన్నా ముందు లొంగిపోయిన కామ్రేడ్ రూపేష్ ఇలాంటి విమర్శలకు చాలా వివరంగా సమాధానం ఇచ్చార’’ని గుర్తుచేశారు. అందువల్ల తాను ఆవిషయాల్లోకి వెల్లదల్చుకోలేదన్నారు. ‘‘ఇపుడు పరిస్థితులు మారిపోయాయి కాబట్టి మిగిలిన వాళ్ళుకూడా ఆయుధాలు వదిలేసి జన జీవన స్రవంతిలో కలవాలని’’ సూచించారు. ‘‘చట్టం పరిధిలో ప్రజల్లో ఉండే పని చేద్దామని’’ ఉద్యమంలో పని చేస్తున్న వారికి ప్రతిపాదించారు. ‘‘అందువల్ల తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని, తమకు మద్ధతు ఇవ్వాలని మేధావులు, ప్రజస్వామిక ప్రేమికులు, ఆదివాసీ ప్రేమికులకు తాను విజ్ఞప్తి చేస్తున్నట్లు’’ భూపతి చెప్పారు. ‘‘ఆయుధాలు వదిలేసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారు, ప్రజల ముందుకు వచ్చి పనిచేయాలనుకుంటున్నవాళ్లు తనను సంప్రదించవచ్చని’’ ఫోన్ నెంబర్ 8856038533 ఇచ్చారు. ఈ నెంబర్ కు ఎవరైనా సంప్రదించ వచ్చని కూడా చెప్పారు. లేకపోతే రూపేష్ నంబర్ కు కూడా సంప్రదించవచ్చని ఆ నెంబర్ 6267138163 కూడా వీడియోలో చెప్పారు