Mahaa Daily Exclusive

  హలో బీసీ.. ఛలో ఢిల్లీ..

Share

  • హలో బీసీ.. ఛలో ఢిల్లీ
  • చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
  • డిసెంబర్ 10న ఢిల్లీలోని కన్స్టిట్యూషన్ క్లబ్‌లో జాతీయ సదస్సు
  • రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

హైదరాబాద్, మహా: స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల కోసం చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యమించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ . కృష్ణయ్య అన్నారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ.. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం హలో బీసీ, ఛలో ఢిల్లీకి ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. డిసెంబర్ 10న ఢిల్లీలోని కన్స్టిట్యూషన్ క్లబ్‌లో బీసీల డిమాండ్లపై నిర్వహిస్తున్న జాతీయ సదస్సు లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి బీసీలు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓబీసీ ప్రధాని ఉన్న ఈ సమయంలోనే, బీసీల హక్కులను సాధించుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం ఊపందుకుందని, ఆ ఉత్సాహంతోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కించుకోవాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు.