Mahaa Daily Exclusive

  ఐబొమ్మ రవి కేసులో సంచలనాలు…

Share

  • ఐబొమ్మ రవి కేసులో సంచలనాలు
  • ఐబొమ్మ, బప్పం సైట్లు బ్లాక్
  • బెట్టింగ్ యాప్ వల్లే చిక్కిన రవి

హైదరాబాద్, మహా
ఐ బొమ్మ ఇమ్మడి రవి కేసులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని వేల సినిమాలను హార్డ్ డిస్క్‌లో రవి భద్రపరిచినట్లు పోలీసులు గుర్తించారు. డిలీట్ అయినా సరే బ్యాకప్ లో వేల సినిమాలను హార్ట్ డిస్కుల్లో అతడు ఉంచినట్లు పోలీసులు కనుగొన్నారు. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నం కాగా.. అతడు ముంబైలో ఎంబీఏ పూర్తి చేసినట్లు విచారణలో వెల్లడైంది. ముస్లిం యువతిని రవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు భార్యతో విడిపోయాడు. 2018 నుంచి హైదరాబాద్ కూకట్ పల్లిలోని రెయిన్ బో విస్టాలో రవి నివాసం ఉంటున్నాడు. తొలుత ప్యామిలీతో ఉన్న అతడు.. ఆ తర్వాత ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే కమ్యూనిటీ వాసులు అడిగితే.. తాను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నట్లు చెప్పేవాడని తెలుస్తోంది. ఓ బెట్టింగ్ యాప్, ఈఆర్ ఇన్ఫోటెక్‌లకు అతడు సీఈవోగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రెయిన్‌బో విస్టా నుంచి ఇతర దేశాలకు ఐపీ అడ్రస్‌ను రవి మార్చుకుంటూ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బ్రిటన్‌లో ఏకంగా ఒక టీంను రవి నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని వేల సినిమాలను తన టీంతో కలిసి సర్వర్ల ద్వారా రవి హ్యాక్ చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. గ్లోబల్‌ వ్యాప్తంగా పెద్ద నెట్ వర్క్‌ను ఇమ్మడి రవి నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్ చేసిన పోలీసులు ఐబొమ్మ, బప్పం సైట్లు బ్లాక్ చేయించారు. నెదర్లాండ్స్ నుంచి ఓటీటీ సర్వర్లను హ్యాక్ చేసి పైరసీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ యాప్ వల్లే రవి చిక్కినట్లు తెలుస్తోంది.

ఐబొమ్మ రవికి నెటిజన్ల మద్దతు

ఇదిలా ఉండగా.. ఐబొమ్మ రవికి సోషల్‌ మీడియాలో రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ‘ఐబొమ్మ’ ట్రెండింగ్‌లో ఉంది. ఇమ్మడి రవిపేదలు, మధ్య తరగతి వాళ్ల కోసమే పైరసీ చేశాడంటూ పోస్టులు పెడుతున్నారు. థియేటర్ రేట్లు భారీగా పెంచడం వల్లే ఐబొమ్మకు అలవాటు పడ్డామంటూ ట్వీట్లు చేస్తున్నారు. సామాన్యులకు అందనంత రేట్లు పెంచి సినిమా థియేటర్లకు రానివ్వని పరిస్థితి తీసుకువచ్చారని సామాన్యులు ఆరోపిస్తున్నారు.

Latest