- ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జోరుగా ప్రచారం
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భార్గవిరాజును గెలిపించుకోవాలని
- గ్రామ ప్రజలను కోరిన కొత్తకర్మ మంగమ్మ శివకుమార్
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా:
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భార్గవిరాజును గెలిపించుకోవాలని, కొత్తకర్మ మంగమ్మ శివకుమార్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో, పదవ వార్డు ఖానాపూర్ లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దొంతలమోని రాజు భార్గవిని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదిభట్ల సర్కిల్ తుర్కయంజాల్ డివిజన్ ఫ్లోర్ లీడర్ కొత్తకర్మ మంగమ్మ శివకుమార్, ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రావణమోని లింగం ముదిరాజ్, కౌన్సిలర్ అభ్యర్థితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది.
తుర్కయంజాల్ డివిజన్ ఫ్లోర్ లీడర్ మంగమ్మశివకుమార్ మాట్లాడుతూ…
స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సారాధ్యంలో మున్సిపాలిటీని వందల కోట్లు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగిందని, ఖానాపూర్ గ్రామంలో 50 వరకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. గ్రామంలోని ప్రతి కుటుంబం ఉచిత బస్సు ఉచిత కరెంటు 500 కే గ్యాస్ సిలిండర్ పొందడం జరుగుతుందని, ఇంకా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేకూరేలా, ప్రజలకు చేరువయ్యేలా ఉండాలి అంటే, ఈనెల 11వ తారీఖున జరిగే పోలింగ్లో, తమ అమూల్యమైన ఓటు వేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజుభార్గవిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఖానాపూర్ గ్రామ ప్రజలను మంగమ్మశివకుమార్ కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








