- ఆకుల విజయ
బీజేపీ మహిళా మోర్చా పూర్వ రాష్ట్ర అధ్యక్షురాలు. - ఇది భారత మహిళకు గర్వ కారణం
- మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే
- మహిళా రిజర్వేషన్ ఇప్పుడు నినాదం కాదు నిజం
- దయా దాక్షిణ్యాల తో కాదు నారీ శక్తి కి ఇది నిదర్శనం
- నేటి మహిళలే రేపటి శాసన కర్తలు
- మోడీ ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకం
- నరేంద్ర మోదీ పేరు చరిత్ర లో సువర్ణాక్షరాలతో చిర స్థాయిగా నిలుస్తుంది
- బీజేపీ మహిళా మోర్చా పూర్వ అధ్యక్షురాలు ఆకుల విజయ
హైదరాబాద్ : దశాబ్దాలుగా మహిళా చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ అనేది ఒక నినాదంగా మాత్రమే ఉంది కానీ దేశ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఉక్కు సంకల్పం తో నిజం గా మారబోతున్నది. నరేంద్ర మోదీ గారి పేరు చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని బీజేపీ మహిళా మోర్చా పూర్వ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ అన్నారు. దేశాన్ని పరిపాలించగల సామర్ధ్యం మహిళల కు ఉందని భారత నారీమణులు ఝాన్సీ లక్ష్మీ బాయి, రాణీ రుద్రమ, అహల్యా బాయి హోల్కర్ లో ఎన్నడో నిరూపించారు. మహిళా రిజర్వేషన్ ను కేవలం నినాదంగా మార్చి దశాబ్దాలుగా రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకున్నాయి తప్ప మనస్పూర్తిగా పని చెయ్యలేదు. మహిళలు అంటే ఒకటి, రెండు కుటుంబాల మహిళలు కాదు చట్ట సభల్లో 33 శాతం ఇవ్వగలగడం అనేది ఒక అద్భుతమని ఆకుల విజయ అన్నారు.
ఈ అంశం పైననే మూడు రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి మరీ ” నారీ శక్తి వందన్ అధినీయం” బిల్లు అమలు చెయ్యడం గొప్ప విషయం అన్నారు. 2029 ఎన్నికల్లో మహిళకు రిజర్వేషన్ కచ్చితంగా కల్పించాలనే ధృడ సంకల్పం తో మోదీ గారు చేస్తున్న కృషికి మహిళా లోకం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు.








