Mahaa Daily Exclusive

  వరంగల్‌లో పండుగలా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు: పేదల సొంతింటి కల సాకారం చేసిన ప్రభుత్వం

Share

*పండగలా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు*

*ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల సాకారం*

*డిప్యూటీ కమిషనర్ ప్రసన్న కుమారి, కార్పొరేటర్ సువర్ణ సురేష్*

మహా వరంగల్ బ్యూరో;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ పథకం గృహలక్ష్మి పేరుతో ఇల్లు లేని పేదలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఇల్లు లేని పేదలందరికీ సొంతింటి కల నెరవేరుస్తుందని ఆ క్రమంలో ఇండ్లు నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులందరూ పండగలాగా గృహప్రవేశ కార్యక్రమాలు చేపడుతున్నారని జి డబ్ల్యూ ఎం సి డిప్యూటీ కమిషనర్ ప్రసన్న కుమారి స్థానిక కార్పొరేటర్ భోగి సువర్ణ సురేష్ తో కలిసి హౌసింగ్ డిఇ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమాలు ఈనెల 20 నుంచి 26 వరకు చేస్తున్నామని అందులో భాగంగా ఈరోజు 37వ డివిజన్లోని ముదిరాజ్ కాలనీలో గంగరబోయిన విజయ్ ఆటో డ్రైవర్ నూతన ఇంటిని డిప్యూటీ కమిషనర్ స్థానిక కార్పొరేటర్ డిఇ, ఆర్ ఐ, ఏఈలు ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు అందరు కలిసి గృహప్రవేశం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ఉద్దేశించి డిప్యూటీ కమిషనర్ ప్రసన్న కుమారి కార్పొరేటర్ సువర్ణ సురేష్ డిఇ విష్ణువర్ధన్ రెడ్డి లు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ముఖ్యంగా ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయంతో ఇందిరమ్మ ఇంటి పథకాన్ని తీసుకొచ్చిందని ముఖ్యంగా నిరుపేదలకు ఈ పదకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఇప్పటివరకు 37వ డివిజన్లో 30 మంది వరకు ఇండ్లు పూర్తి చేసుకున్నారని రాబోయే కాలంలో డివిజన్ కు ఇచ్చిన 248 మందితో పాటు లబ్ధిదారులను గుర్తించి మరిన్ని ఇండ్లు కూడా మంజూరు చేస్తామని అన్నారు సొంతింటి కల నెరవేరిన లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని ఇల్లు రాని వాళ్ళందరికీ కూడా అర్హులకు రాబోయే నెలలో మరిన్ని నూతన ఇండ్లను ప్రభుత్వం ఇస్తుందని ప్రతి ఒక్క పేదలు ఈ పథకాన్ని ఉపయోగించుకొని సొంతిల్లు నిర్మాణం చేసుకోవాలని కోరారు. ఇంతటి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక మంత్రి కొండ సురేఖ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో ఆర్ ఐ ప్రతిభ ఏ ఇ లు హారిక రెడ్డి, తేజస్విని ఇందిరమ్మ ఇంటి కమిటీ సభ్యులు బోయిన దూడయా సంగారబోయిన చందర్, బెడద వీరన్న మిడుదల రాణి మాదాసి మధు, శంభుని గుడి చైర్మన్ బంగారు శ్రీనివాస్, కలకొట్ల కుమార్, అభిషేక్ సంతోష్ లతోపాటు లబ్ధిదారులు వారి కుటుంబం తో పాటు బంధువులు తదితరులు పాల్గొన్నారు.