Mahaa Daily Exclusive

  ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్…

Share

ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.
• తీవ్ర సైనిక చర్య తప్పదన్న అమెరికా అధ్యక్షుడు.
ఢిల్లీ, మహా.
మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై శక్తివంతమైన సైనిక చర్య తప్పదని హెచ్చరిస్తూ, టెహ్రాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మన శత్రువులను అత్యంత ఘోరంగా దెబ్బకొడతాం. వారికి గట్టి గుణపాఠం చెబుతాం” అని వ్యాఖ్యానించారు.

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అర్ధరాత్రి పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ అప్రమత్తమై అన్ని క్షిపణులను గాల్లోనే విజయవంతంగా కూల్చివేసినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. దాడి నేపథ్యంలో మిడిల్ ఈస్ట్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.