Mahaa Daily Exclusive

  దేశాయిపేట లో మెగా వైద్య శిబిరం.

Share

 

*క్షయ వ్యాధి పట్ల అవగాహన తప్పనిసరి*

*డాక్టర్ భరత్ కుమార్*

మహా వరంగల్ బ్యూరో ;

వరంగల్ నగరంలోని 12 వ డివిజన్ దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారము టీబి ముక్తి భారత్ అభియాన్ రెండో విడతలు భాగంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి భరత్ కుమార్ మాట్లాడుతూ క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. క్షయ వ్యాధి లక్షణాలు అలసట తలనొప్పి జ్వరము రాత్రిపూట చెమటలు పట్టడం ఆకలి మంద గింజడం వంటి లక్షణాలున్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంప్రదించి వైద్య సేవలు సలహాలు సూచనలు పాటించాలని కోరారు. వైద్య శిబిరంలో 235 మందికి రక్త పూత పరీక్షలు నిర్వహించి అందులో 104 మందికి డిజిటల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫుల్లీ కంప్యూటర్ చెస్ట్ ఎక్సరే పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో టీబి నియంత్రణ విభాగం ప్రతినిధులు నరేష్ రంజిత్ సూపర్వైజర్ జన్ను కోర్నెలు ఫార్మసీ ఆఫీసర్ సంఘ అనిల్ కుమార్ ఏఎన్ఎంలు జ్యోతి శోభ అమృత నిహారిక సర్వత్ సుల్తానా కాల్వల కుమార్ ఆశ కార్యకర్తలు సుమలత మమత గీత ప్రమీల పరిమళ శోభ పూలమ్మ సంధ్య శ్రీవాణి ఆడపు జ్యోతి జన్ను బుచ్చయ్య మేధా నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.