Mahaa Daily Exclusive

  కేసీఆర్ కు రేవంత్ ఉరట కలిగించారు….

Share

  • కేసీఆర్ కు రేవంత్ ఉరట కలిగించారు
  • హైకోర్టు కలిగించిందనడం తప్పు
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • కేసీఆర్‌పై చర్యలు తీసుకునే దమ్ములేకే మాపై విమర్శలని మండిపాటు

హైదరాబాద్, మహా : కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పు దేవైరై కేసీఆర్ కు ఉరట లభించిందనడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం తనను కలిసిన మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి కేసీఆర్‌కు ఊరట కలిగించింది హైకోర్టు కాదని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వమని అన్నారు. కేసీఆర్‌ కుటుంబంపై అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. కేసీఆర్‌ కుటుంబంపై చర్యలు తీసుకునే దమ్ములేకే తమపై విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రెండేళ్ల తర్వాత కేసీఆర్‌ మళ్లీ మోటార్లకు మీటర్లు అంటున్నారని, పదేళ్ల నుంచి అదే పాట పడుతున్న కేసీఆర్ ఒక్కరోజూ దాన్ని నిరూపించలేకపోయారని విమర్శించారు. మైక్ దొరికితే తనంత మేధావి ఎవరూ లేరని కేసీఆర్ అనుకుంటారన్నారు.

ఆర్టీసీ సమస్యకు ఒక్క జీవో చాలు

ఆర్టీసీ కార్మికులకు రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క జీవోతో వాళ్ల సమస్యలు పరిష్కారం అయ్యేవని.. కానీ ఆర్టీసీ కార్మికులను రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో కేసీఆర్ ఇదే తరహాలో ఆర్టీసీ కార్మికులను రాచి రంపాన పెట్టారని, అదే తరహాలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.