Mahaa Daily Exclusive

  ట్రాన్స్ఫారం కాలిపోవడంతో.. అంధకారంలో వెంకటసాయి నగర్

Share

  • ట్రాన్స్ఫారం కాలిపోవడంతో.. అంధకారంలో వెంకటసాయి నగర్
  • స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు.
  • -కాలిపోయిన ట్రాన్స్ఫారం ప్లేసులో.. కొత్తది ఏర్పాటుచేసి
    విద్యుత్
  • సరఫరాకొనసాగించిన విద్యుత్ శాఖ అధికారులు.
    -నిద్రాహారాలు మాని, తెల్లార్లు శ్రమించి.. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసిన విద్యుత్ శాఖ అధికారులు
  • ఏఈ వెంకన్న ను ప్రశంసిస్తున్న మండల వాసులు

కారేపల్లి, మహా: కారేపల్లి శ్రీ వెంకట సాయి నగర్ లో గురువారం సాయంత్రం 7 గంటల సమయంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీంతో వెంకట సాయి నగర్లో.. కారు చీకట్లు కమ్ముకోగా చిన్న పిల్లలు వృద్దులు, మహిళలు ఇబ్బందులు పడ్డారు. కాగా.. స్పందించిన ట్రాన్స్కో ఏడి యాసిన్, కారేపల్లి క్రాస్ రోడ్డు సబ్ స్టేషన్ ఏఈ వెంకన్న, ఫోర్ మెన్ లక్ష్మీనారాయణలు చొరవ తీసుకొని, వెంకట సాయి నగర్ వాసుల సహకారంతో.. ఖమ్మం నుంచి అప్పటికప్పుడు వాహనంలో కొత్త ట్రాన్స్ఫార్మర్ను తీసుకొని వచ్చి అంధకారంలో ఉన్న శ్రీ వెంకట సాయి నగర్లో .. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ను జెసిబి సహాయంతో తొలగించి, ఆ ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల నుంచి, తెల్లవారుజామున 2.30 గంటల వరకు శ్రమించి నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. తక్షణమే స్పందించి.. నూతన ట్రాన్స్ఫారము ఏర్పాటు చేసి, శ్రీ వెంకట సాయి నగర్ కాలనీకి విద్యుత్ సరఫరా కొనసాగించిన విద్యుత్ శాఖ అధికారులను, రషీద్. హెల్పర్ గురు స్వామి, బాబురావు లను ..కాలనీవాసులు ప్రశంసించారు.